calender_icon.png 17 October, 2024 | 6:24 PM

గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము..

17-10-2024 04:47:49 PM

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమము(ఎన్ ఎ డిసిపి) 5వ విడత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  మరియు జిల్లా స్పెషల్ జడ్జి (ఎస్సీ/ఎస్టీ-పి ఓ ఏ) సునీత రవీందర్ రెడ్డి సంగారెడ్డిలోని వైకుంటపురం గోశాలలో ప్రారంబించారు. ఈ కార్యక్రమములో  జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. గాలి కుంటు వ్యాధి ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారు, రైతులు ఈ వ్యాధి సోకకుండా తమ పశువులకు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. పశువైద్య సిబ్బంది అన్ని గ్రామాలలో ముందస్తు సమాచారంతో వెళ్లి టీకాలు వేసి భారత్ పశుదాన్ యాప్ లో వివరాలు పొందుపరచాలని కోరారు.


ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో తెల్లజాతి పశువులు 99188 నల్లజాతి పశువులు 113828 మొత్తం  213016 ఉన్నాయని, ఇట్టి పశువులకు ప్రతి సంవత్సరం రెండుసార్లు  గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి టీకాల కార్యక్రమము, పశువులు కలిగిన ప్రతి రైతు పశువులకు  టీకాలు వేయించాలని చెప్పడం జరిగింది. పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించకపోతే పశువులలో పాలోత్పత్తి తగ్గుతుంది, మరియు సంతానోత్పత్తి కుడా తగ్గిపోతుంది. ఈ టీకాలు 4 నెలలు పైబడిన ప్రతి పశువుకు ఇప్పించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమము నవంబర్ 14th వరకు జరగనుందని, కావున ప్రతి రైతు వారి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని తెలిపారు.

వైకుంటపురం గోశాలలో మొత్తం 145 ఆవులకు టీకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమములో డా.వసంత కుమారి, జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి,  వైకుంటపురం గోశాల నిర్వాహకులు, వరదాచార్యులు, జిల్లా సహాయ సంచాలకులు డా. సి.హెచ్. రవీంద్ర ప్రసాద్ మరియు జిల్లా సహాయ సంచాలకుల డా. రాజేశ్వర్ లు, పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డా. యామిని, డా. అజిత్ చంద్ర మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.