27-04-2025 12:35:15 AM
ఇటలీలో ముగిసిన అంత్యక్రియలు
సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ఖననం
అంతిమయాత్రలో 1.50లక్షల మంది
వాటికన్‌సిటీ, ఏప్రిల్ 26: కేథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్య క్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివా రం సాయంత్రం ముగిశాయి. పోప్‌కు ఇష్టమైన రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బసి లికాలో శవపేటికను ఖననం చేసినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. అనంతరం పోప్ సమాధి వద్ద కార్డినల్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపాయి.
చర్చిలో జరిగిన అంత్యక్రియలకు కేవలం ఉన్నతస్థాయి కార్డినల్స్, పోప్ సన్నిహితులు మాత్రమే హాజరయ్యా రు. అంతకుముందు భారత రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ విలియం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, స్పెయిన్ రాజు ఫిలిప్ రాణి లెటిజియా, బ్రెజిల్ అధ్యక్షు డు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సహా 54 దేశాధినేతలు, 12 మంది రాజ కుటుంబ సభ్యులు పోప్‌కు నివాళులర్పించారు.
సంప్రదాయానికి భిన్నంగా..
పోప్‌ల భౌతికకాయాన్ని వాటికన్‌సిటీ లోపలే సెయింట్ పీటర్స్ బసిలికాలో ఖననం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే, ఈ సంప్రదాయానికి భి న్నంగా పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు వాటికన్‌సిటీ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో జరిగాయి. దీనికి కారణం పోప్ ఫ్రాన్సిస్ అభీష్టమే. రోమ్‌కు కొన్ని కిలోమీట ర్ల దూరంలో తన అంత్యక్రియలు జరగాలని పోప్ ఫాన్సిస్ భావించారు.
పోప్ సేవలు అజరామరం: భారత రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పిస్తున్న ఫోటోలను ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్రమోదీ పోస్ట్ చేశారు. సమాజానికి పోప్ ఫ్రాన్సిస్ చేసిన సేవను ప్రపంచం గుర్తుపెట్టుకుంటుదని పునరు ద్ధాటించారు.
తరలి వచ్చిన ప్రజలు
వాటికన్‌సిటీలో పోప్ అంతిమయా త్ర స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మొదలైంది. తెలుపు రంగు లో ఉన్న ప్రత్యేక వాహనంలో ఫ్రాన్సిస్ అంతిమయాత్ర జరిగింది. స్థానికకాలమానం ప్రకారం శనివారం మధ్యా హ్నం 2 గంటల సమయంలో పోప్ భౌతికకా యం వాటికన్‌సిటీని వీడింది. సుమారు అర్ధగంటపాటు అంతిమయా త్ర జరిగిన తర్వాత ఆయన భౌతికకా యం సెయింట్ మేరీ మేజర్ బసిలికాకు చేరుకుంది.
అంతిమయాత్ర సందర్భం గా రోమ్ వీధులు జనాలతో కిక్కిరిసిపోయాయి. సుమారు 1.50 లక్షల మంది ప్రజలు రోడ్లకు ఇరువైపు నిల్చుని అంతిమయాత్రను వీక్షించినట్టు వాటికన్ వర్గా లు పేర్కొన్నాయి. పోప్ అంత్యక్రియల సందర్భంగా మణిపూర్ రాజధాని ఇం ఫాల్‌లోని సెయింట్ జోసెఫ్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించా రు. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా పోప్ పార్థీవదేహాన్ని దాదాపు 2.50 లక్షలమంది ప్రజలు సందర్శించి నివాళులర్పించారు.