calender_icon.png 1 October, 2024 | 3:45 AM

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

01-10-2024 12:05:31 AM

నిర్మల్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): తెలంగాణ జాబ్ కాలెండర్ ద్వారా నిర్వహించబోతున్న డీఎస్సీ లో ఖాళీగా ఉన్న ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూ జిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేసేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థులు కోరారు. ఈ మేరకు నిర్మల్‌లో సోమవారం నిరస న వ్యక్తం చేశారు. 35 సంవత్సరాలు గా  నిర్వహించిన వివిధ డీఎస్సీల్లో ఈ పోస్టులను ఇప్పటి వరకు భర్తీ చే యకపోవడంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఎన్నో ఆశలతో తాము ఈ కోర్సుల ను పూర్తి చేసినా ఉద్యోగ అవకాశా లు రాకపోవడంతో ఇబ్బందులు ప డుతున్నామని అదనపు కలెక్టర్ పైజా న్ అహ్మద్‌కు వివరించారు.