28-08-2024 01:00:07 AM
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): తూనికలు కొలతల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. తూనికలు, కొలతల్లో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టంచేశా రు. ఈవోడీబీ చట్టం పేరుతో వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
సచివాలయంలో తూనికలు కొలతల శాఖపై పౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహన్, సహాయ కార్యదర్శి ప్రియాంక, అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్‌తో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. తూనికలు కొలతల శాఖపై వినియోగదారు ల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు మోసపోకుండా తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
పెట్రోల్ బంక్‌లతోపాటు వేయింగ్ మిషన్లపై నిఘా పెంచాలని కోరారు. జిల్లాల వారీగా తరచూ సమీక్ష లు నిర్వహించాలని సూచించారు. శాఖాపరంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారిస్తామని భరోసా ఇచ్చారు.