calender_icon.png 15 October, 2024 | 11:48 AM

వైద్య కళాశాలలో పోస్టుల భర్తీ

15-10-2024 12:10:33 AM

ఖమ్మం, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు సోమవారం తెలిపారు. 5 అసిస్టెంట్ ప్రొఫెసర్, రేడియో డయాగ్నాసిస్, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎ మర్జెన్సీ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్ పోస్టులతో పాటు ఐసియూలో సేవలందించేందు కు  5 సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అర్హత ఉన్న వారు ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.