calender_icon.png 31 October, 2024 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ పోస్టుల ఖాళీలను వెల్లడించాలి

04-07-2024 12:45:08 AM

వీటిని ఈ డీఎస్సీలో కలిపి భర్తీ చేయాలి

డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): టీచర్ పోస్టులకు సంబంధించిన పూర్తి ఖాళీలను వెల్లడించాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఏర్పడిన ఖాళీల వివరాలు జిల్లాలవారీగా వెల్లడించాలని కోరారు. కొత్తగా ఏర్పడిన ఖాళీలను ప్రస్తుత డీఎస్సీలో కలిపి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ వేస్తామని ఇచ్చిన హామీ మేరకు పోస్టులను పెంచాలని విజ్ఞప్తిచేశారు. చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు కూడా పూర్తిస్థాయిలో ఖాళీలు చూపలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ఖాళీలను ఈ డీఎస్సీలోనే జతచేసి, నెల రోజులు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.