ఈతరం మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని, స్టార్టప్‌లో దూసుకుపోవాలనుకుంటున్నారు. కానీ సరైన వేదిక దొరక్క రేసులో వెనుకబడిపోతున్నారు. ఆలోచన మంచిదైనా.. ఆర్థిక ప్రోత్సాహం లేకపోవడంతో అనుకున్న రీతిలో రాణించలేకపోతున్నారు. అలాంటి వారికి ఆలోచన మొదలుకుని వ్యాపారంలో ఎదిగే వరకు వారధిగా నిలుస్తున్నది వి-హబ్. ఔత్సాహిక మహిళా వ్యాపారులకు అందిస్తున్న సహకారం.. చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు వి-హబ్ సీఈవో సీత పల్లచోళ్ల.. అవి ఆమె మాటల్లోనే..
వి-హబ్‌ను ప్రత్యేకం గా మహిళ వ్యాపారవేత్తలకు చేయూతను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొ చ్చింది. ఇది ముఖ్యంగా మహిళ వ్యాపారవేత్తలకు సిస్టమాటిక్ సపోర్టు అందిస్తుంది. దాంట్లో కూడా రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి అర్బన్, రెండొది రూరల్. అర్బన్ కింద ‘వీ ఎంగేజ్’ ప్రోగ్రాం చేస్తున్నాం. ‘వీ ఎంగేజ్’ ప్రొగ్రాం ద్వారా వ్యాపారం చేయడానికి 21 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంచుకున్నాం.
ఎలా ఎంపిక చేశారు?
వివిధ రకాలైన పెట్టుబడులు కావాలని 200పైగా అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో 21మంది మాత్రమే ఎంపిక చేశాం. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉన్నావారిని మాత్రమే ఎంపిక చేశాం. ఇప్పుడిప్పుడే.. జస్ట్ ఐడియాతో ఉన్నా వాళ్లు ఈ ప్రోగ్రాం ద్వారా లాభాలు పొందలేరు. ‘వీ ఎంగేజ్’లో జాయిన్ అవ్వాలంటే ముందుగా ఒక ప్రొడక్ట్ మీ చేతిలో ఉండి ఉండాలి.
మీ సహకారం ఎలా ఉంటుంది?
జీవితంలో లక్ష్యాల్ని , కలల్ని నెరవేర్చుకోవాలనే మహిళలకు వి-హబ్ అండగా నిలబడుతుంది. ప్రీ ఇంక్యుబేషన్, ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్ కార్యక్రమాలతో ఐడియా దశ నుంచి వారి ఉత్పత్తులు మార్కెట్‌లోకి వెళ్లేవరకూ ఎవరికి ఏది అవసరమో గుర్తించి టైలర్‌మేడ్ సొల్యూషన్స్‌ని అందిస్తాం.
ఆలోచనా దశ నుంచి వారు తమ లక్ష్యం చేరుకునే వరకూ అన్ని విధాలుగా సాయపడతాం. వారికి ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, మార్కెట్, క్రెడిట్ లింకేజీలు, ఇతర నిధుల అవకాశాలను కల్పిస్తాం. సంబంధిత రంగాల నిపుణులను తీసుకొచ్చి మెంటారింగ్ చేయిస్తాం.
అభివృద్ధి ఎలా జరుగుతుంది?
వి-హబ్ స్థానికంగా ఉన్నా మహిళ సంఘాల ద్వారా.. మెప్మాతో కలిసి ముందుకు వెళతాం. వారిద్వారా వెళ్తే ఎక్కువమందికి చేరుకుంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వి-హబ్ అంటే కేవలం హైదరాబాద్ అనుకుంటారు. కానీ జిల్లాల్లో కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి.
వి-హబ్ తరపున అదనంగా ఎలాంటి ఉపయోగం?
వాస్తవానికి చాలామందికి మన ప్రభుత్వంలో ఏం స్కీమ్స్ ఉన్నాయో తెలిదు. మేం స్కీమ్ పట్ల అవగాహన కల్పించి.. వారికి అవసరమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని స్కీమ్స్‌కు అర్హులైతే ఆ స్కీమ్స్‌ను వ్యాపారానికి ఎలా ఉపయోగించుకోవాలో వివరిస్తాం. అలాగే క్రెడిట్ లింకేజీలు, బ్యాంకు లోన్లు ఇప్పిస్తాం. మనకు ప్రత్యేకంగా క్రెడిట్ లింకేజీ డివిజన్ ఉంటుంది.
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే బ్యాంకులు లోన్లు ఇవ్వనంటారు. అటువంటి సమయాల్లో దాన్ని ఎలా టెకప్ చేయాలి? బ్యాంకు నుంచి లోన్ రానప్పుడు.. ప్రయివేట్‌గా ఎవరన్నా ఇన్వెస్టర్స్ ఉన్నారా? బ్యాంకు లోను మాత్రమే కాకుండా మిగతా ప్రభుత్వ స్కీమ్స్‌కు అర్హులా? అని తెలుసుకుని కరెక్టు సలహా ఇస్తాం.
మీరు ఏ సంస్థలతో కలిసి కోఆర్డినెట్ చేస్తున్నారు?
మెప్మా, సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఇలా వీళ్లందరికి ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ప్రోగ్రాం గురించి వివరించాం. ప్రతి సంస్థ నుంచి ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్లు మిగతా వారికి అవగాహన కల్పిస్తారు.
వి-హబ్ లక్ష్యాలు ఏంటి?
ఇది మహిళలకు సంబంధించిన బిజినెస్ ప్లాట్ ఫాం.. మహిళలు తమ కలలు నెరవేర్చుకునేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశాం. ఈ వేదిక కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో అంతర్జాతీయస్థాయికి తీసుకెళతాం. ఇప్పటికి బిజినెస్‌లో రాణిస్తున్నా.. వ్యాపారరంగంలో అడుగు పెట్టాల నుకున్నా మహిళలకు చక్కటి అవకాశం విహబ్.
విద్యార్థినులతో కలిసి వి-హబ్ పని చేస్తుందా?
కచ్చితంగా వ్యాపారంలో ముందుకు రావాలి అనుకునే అమ్మాయిలను వి-హబ్ ఎప్పుడూ ప్రోత్సాహిస్తుంది, సపోర్టు సిస్టమ్‌ను అందిస్తుంది. దీనికి సంబంధించి.. స్టూడెంట్ వర్టికల్ కూడా ఉం ది. దాంట్లో ‘వీ ఎనబుల్’ అని ప్రారంభిం చాం. ఇది 25 కాలేజీలతో కలిపి పనిచేస్తున్నది. చాలామంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ రాకుంటే ఏం చేయాలి? అనే సందేహంలో ఉంటారు. అలాంటివారికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవగాహన కల్పిస్తాం.
జిల్లాస్థాయిలో ఎలా పని చేస్తున్నారు?
నిజానికి రూరల్ విభాగం అనేది వి-హబ్‌కు చాలా ముఖ్యమైనది. జిల్లాల్లో, మండలాల్లో కూడా పని చేస్తాం. అది స్థానికంగా ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థలతో కలిసి పనిచేస్తాం. దీనికోసం ‘వీ రిచ్’ అనే ప్రోగ్రాం పెట్టాం. దానిద్వారా 33 జిల్లాల నుంచి 300 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో నుంచి ఒక 60మందిని ఎంపిక చేసుకున్నాం.
ఈ ప్రోగ్రాం ద్వారా మహిళలు ఇంటి నుంచి బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే ‘కల్చలర్ ఎంటర్‌ప్రైస్ కొహర్ట్’ అనే ప్రోగ్రాం ద్వారా స్థానికంగా తయారు చేసే వెదురు బుట్టలు, నిర్మల్ బొమ్మలు, తెలంగాణ రుచులు కావచ్చు. వీటిని ఈ ప్రోగ్రాం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం.
రూప