కేసీఆర్ కంటే పెద్ద తుగ్లక్ కేటీఆర్
ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): వీ6 బిజినెస్ సొల్యూషన్స్‌తో వీ6, వెలుగు మీడియాకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎమ్మె ల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. వీ6 బిజినెస్ సంస్థకు బెంగుళూరులోని హంపీనగర్లో ఆఫీసు ఉందని తెలిపారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ వీ6 బిజినెస్ సొల్యూషన్స్ తమదేనంటూ కేటీఆర్ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కంటే పెద్ద తుగ్లక్ కేటీఆరేనని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చెప్తున్నట్టు వీ6 బిజినెస్ సొల్యూషన్స్ సంస్థకు కర్ణాటక వాల్మీకి స్కాంలో భాగం ఉందని, ఆ సంస్థకు రూ.4.5కోట్లు బదిలీ అయ్యాయని ఆరోపిస్తున్నారని చెప్పారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తన సంస్థలన్నీ చట్టబద్ధంగానే నడుస్తున్నాయని చెప్పారు.