calender_icon.png 23 December, 2024 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను రాజ్యసభకు పంపండి: వీహెచ్

10-07-2024 04:00:26 PM

ఎనిమిదేళ్లలో నాకు ఒక్క పదవి లేదు

సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వస్తే గెలుస్తుండే

హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్ నేతమాజీ ఎంపీ వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభకు తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని వీహెచ్ అన్నారు. ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో తనకు ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడిని పేర్కొన్నారు. టీ-20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సిరాజ్ కు సీఎం రేవంత్ రెడ్డి, ప్లాట్, ఉద్యోగం ఇస్తాననడం హర్షణీయం అన్నారు. గతంలో అతని ప్రతిభను చూసి సీఎఫ్ఐ ఛైర్మన్  గా తాను సన్మానించానని గుర్తుచేశారు. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయన్న వీహెచ్ తెలంగాణలో స్టేడియానికి ప్రతి జిల్లాలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హనుమంతరావు విన్నవించారు.