పాతకాలంలో ప్రతి ఇంట్లో ఉట్టి దర్శనమిచ్చేది. తాళ్లతో అల్లిన ఉట్టి పైకప్పునుంచి కిందకు వేలాడుతుండేది. గ్రామీణ మహిళలు పాలు, పెరుగు వంటి వాటిని గిన్నెల్లో భద్రపరిచి ఉట్టిలో వేలాడదీసేవారు. ఇంట్లో పెంపుడు జంతువులకు అంద కుండా ఉట్టిని ఉపయోగించేవారు. ఉట్టిలో ఆహార పదార్థాలు తాజాగా ఉండేవి కూడా. పెరుగు, జున్నును ఎవరైనా దొంగిలి స్తే.. ‘అందరూ మంచివారే ఉట్టి మీద ఉన్న పాలకుండలో పాలు ఏమయ్యాయి’? అనే సామెతలు పుట్టుకొచ్చాయి. ఈక్రమంలో “ఉట్టి మీద కూడు.. ఉప్పు చేపతోడు.. వడ్డించ నువ్వుచాలు” అంటూ సినీ రచయితలు రాసిన పాటలూ ఉన్నాయి. అలా ఉట్టితో ప్రత్యేక అనుబంధం ఉండేది. అయితే ఫ్రిడ్జ్ లాంటివి అందుబాటులోకి రావడంతో ఉట్టి కనుమరు గైపోయింది.