* అత్యాచారం చేసినట్టు మహిళ ఫిర్యాదు
* ప్రెస్‌మీట్ మధ్యలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
లక్నో, జనవరి 30: అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాథోడ్‌ను అరెస్ట్ చేసేందుకు కొత్వాలి నగర్ పోలీసులు ఆయ న ఇంటికి వెళ్లినప్పుడు ఆయన ప్రెస్మీట్లో ఉన్నారు. సమావేశం మధ్యలోనే భారీ బం దోబస్తు మధ్య ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం రాథోడ్ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దీం తో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
మహిళ ఫిర్యాదుతో..
తనను పెళ్లిచేసుకుంటానని వాగ్దానం చేసి నాలుగేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 17న ఉత్తరప్రదేశ్ పోలీసులు రాథోడ్‌పై కేసు నమోదు చేశారు.