- నోట్లకట్టలతో దొరికిన దొంగలు మీరు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఆగస్టు31(విజయక్రాంతి): ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో వాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టపగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగలు కాంగ్రెస్ దొంగలకు పదేండ్లు సుపరిపాలన అందించిన కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దక్కిందనే మనోవేదనతోనే ఉత్తమ్ రేవంత్‌ను అనాల్సిన మాటలు కేసీఆర్‌పై వాడుతున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకులు డిపార్ట్‌మెంట్‌ల వారిగా పంచుకుని దోచుకుంటురన్నారని, రాష్ట్రంలో డెకాయిట్‌ల పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. నాగార్జునసాగర్ కాల్వ నుంచి చెరువులు ఎందుకు నింపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం నీరు అందించకపోతే కాంగ్రెస్ నాయకులకు రైతులతో దెబ్బలు తప్పవని జగదీష్‌రెడ్డి అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, ఎన్ భిక్షం పాల్గొన్నారు.