calender_icon.png 20 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ విమర్శిస్తే ఉత్తమ్ సీఎం కాలేరు

01-09-2024 01:10:22 AM

మాజీ మంత్రి వేముల 

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు పాలించి తెలంగాణను అభివృద్ధి బాట పట్టించిన కేసీఆర్‌ను మంత్రి ఉత్తమ్ విమర్శించడం దిగజారుడు తనానికి నిదర్శమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజగోపాల్ వ్యాఖ్యలకు సంబురపడి ఉత్తమ్ తనకు తాను సీఎంగా ఊహించుకొని రేవంత్‌లా బూతులు మాట్లాడే ప్రయ త్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజాపాలన పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీ పాలన చేస్తు న్న వారే అసలైన డెకాయిట్లు అని మండిపడ్డారు. గురుకులాల్లో చిన్నారుల నోటికాడి ముద్దను గుంజుకుని మింగుతున్న దొంగలు కాంగ్రెస్ నాయకులని ఆరోపించారు.