calender_icon.png 29 April, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు వినియోగం

29-04-2025 12:33:10 AM

దిశ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి

ఖమ్మం, ఏప్రిల్ 28 ( విజయక్రాంతి ):-ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ నిధులు సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా శాసన సభ్యులు మాలోతు రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

సమావేశానికి ముందు కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.దిశ సమావేశంలో ప్రస్తుతం వారి శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులు నివేదికలు వివరించారు.ఈ సందర్బంగా పార్లమెంట్ సభ్యులు రఘురాంరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాల సమగ్ర సమాచారం అందిస్తే వాటిని ఫాలో అప్ చేస్తానన్నారు.

ఖమ్మం జిల్లాలో నూతన రంగాలలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.వైద్య శాఖ పరిధిలో ఇబ్బందులపై రిపోర్ట్ అందించాలని ఎంపీ తెలిపారు. జిల్లాలో ఎక్కడ అదనపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవసరం ఉన్నది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అవసరమో ప్రతిపాదనలు అందించాలని తెలిపారు.కేంద్ర పథకాల నుంచి వచ్చే నిధులను మరింత సమర్థవంతంగా వినియోగించు కునేందుకు అవసరమైన రిపోర్టులను అధికారులు అందించాలని అన్నారు. ప్రజా ప్రతినిదులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని ఎంపి అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్,వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఆర్డీవో సన్యాసయ్య, జెడ్పీ సిఇఓ దీక్షా రైనా పాల్గొన్నారు.