calender_icon.png 17 November, 2024 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేస్ట్‌ను ఎక్కువగా వాడుతున్నారా!

12-11-2024 12:00:00 AM

ఉదయం నిద్రలేవగానే ప్రతీ ఒక్కరం చేసే పని బ్రష్ చేసుకోవడం. నోటి ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కేవలం ఉదయాన్నే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా బ్రషింగ్ చేసుకోవాలి అని నిపుణులు చెబుతుంటారు. నోటి ఆరోగ్యం, చిగుళ్ల ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బ్రషింగ్ చేసుకోవాలి. అయితే బ్రషింగ్ విషయంలో మనలో కొందరు తెలి సో.. తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిలో ప్రధానమైంది.

టూత్ పేస్ట్. సాధారణంగా ఎక్కువ టూత్ పేస్ట్ వాడితే మంచిదని చాలామంది భావిస్తుంటారు. ఇంతకీ టూత్ పేస్ట్ ఎక్కువగా వాడటం మంచిదేనా? అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే నిపుణులు అభిప్రాయం ప్రకారం.. టూత్ పేస్ట్ ఎంత వాడాలి? లాంటి వివరాలు తెలుసుకుందాం.. టూత్ పేస్ట్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బఠానీ గింజ పరిమాణం టూత్ పేస్ట్ ఉంటే చాలని చెబుతున్నారు.

ఇది మొత్తం దంతాలను శుభ్రం చేసుకోవడానికి సరిపోతుంది. అయితే టూత్ పేస్ట్‌ను ఎక్కువగా ఉపయోగించడం హానికరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సాధారణంగా టూత్ పేస్ట్‌లో సోడి యం ఫ్లోరైడ్‌ను ఉపయోగిస్తారు. ఇది దంతాలను బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుంది. అయితే అధిక మొత్తంలో తీసుకుంటే సోడియం ఫ్లోరైడ్ కారణంగా నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో దంతాల్లో కావిటీస్ ఏర్పడి ఫ్లోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి.

అందుకే కొత్త మొత్తంలోనే టూత్ పేస్ట్‌ను ఉపయో గించాలి. నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మౌత్ ఫ్రెష్‌నర్స్‌ను ఉపయోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన, నోట్లో బ్యాక్టీరియా తగ్గాలంటే మౌత్ ఫ్రెష్‌నర్స్ బాగా ఉపయోగపడతాయి.