మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి. మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు. అయితే అదంతా మట్టి పాత్రలు గొప్పతనం తెలియకే? నాన్ స్టిక్..
స్టున్ లెస్ స్టీలు.. అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. యాసిడ్స్ కలిగిన పదార్థాలు.. అంటే టమాటాలు, పుల్లని పదార్థాలకు అల్యూమినియం పాత్రలు వాడినప్పుడు రసాయన చర్య జరిగి అల్యూమినియం తినే పదార్థాలలో కలిసే ప్రమాదం ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది.
ఇంట్లో అల్యూమినియం పాత్రలు వాడాల్సి వచ్చినప్పుడు కూడా వాటిలో ఎక్కువ సమయం పులుపు, పులిసిన పదార్థాలు నిల్వ చేయకూడదు. ఎక్కువ సమయం వేడి చేయకుండా వాడుకోవాలి. అయితే క్రోమియమ్, లెడ్, కాడ్‌మియమ్, నికిల్ వంటి మిగిలిన వస్తువులలో కంటే అల్యూమినియంలో ఉడికించేటప్పుడు మూడింతలు ఎక్కువ కరిగి పదార్థాలతో కలిసే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల బ్రెయిన్‌లోని క్రోమాటిక్ నెట్ వర్క్ పైన ప్రభావం పడి, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువైంది. అల్యూమినియం చేసే హాని నుంచి బయటడాలంటే ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలి.
ఈ ఎనొడైజ్డ్ మెటల్‌తో తయారు చేసిన పాత్రలు, పాన్‌లు కూడా త్వరగా వేడెక్కడమే కాక.. మన్నిక కూడా ఎక్కువకాలం ఉంటుంది. దాంతో గీతలు పడకుండా, శుభ్రం చేసుకునేందుకు కూడా సులువుగా ఉంటాయి. ఈ ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలలో పదార్థాలు వండటం వల్ల అల్యూమినియం ఆహారంలో కలిసే ప్రమాదం అంతగా లేదని పరిశోధకులు చెప్తున్నారు.