calender_icon.png 5 April, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా విద్యుత్ చౌర్యం

31-03-2025 12:00:00 AM

చోద్యం చూస్తున్న అధికారులు 

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 30 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఎక్కడ చూసినా ఏదేచ్ఛగా విద్యుత్ చౌర్యం దర్జాగా జరుగుతుం ది. గత రెండు రోజులుగా పాల్వంచ పట్టణంలోని రోడ్లను కటింగ్ చేస్తున్నారు. అందుకు విద్యుత్ తీగల కు తగిలించి దొంగ కరెంటు వాడుతున్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీ లో సిమెంట్ రోడ్డు కట్ చేసేందుకు అక్రమంగా విద్యుత్ వాడుతుండగా, అందిన ఫిర్యాదు మేరకు విద్యుత్ శాఖ అధికారుల కు  అక్కడకు చేరుకొని తనిఖీ చే యగా విద్యుత్తు అక్రమంగా వాడుతున్నట్లు నిర్ధారణకు నిరంతరం విద్యుత్ అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు సమాచారం అందితే తప్ప స్పందించలేని స్థితిలో ఉన్నారనీ ఈ సంఘటనతో తేటతెల్లమైంది. వి ద్యుత్ శాఖ అధికారులు అక్రమార్కునికి రూ 4వేల అపరాధ రుసుము వసూలు చేయనున్నట్లు వారు తెలిపారు.