05-03-2025 01:20:32 AM
ఖమ్మం ఎన్.ఎస్.పి. కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ.ఐ. తరగతి విద్యా బోధనను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం,మార్చి-4(విజయక్రాంతి):సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథ)ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 53వ డివిజన్ ఎన్.ఎస్.పి. కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ.ఐ. విద్యా బోధనను పరిశీలించి, ఏ.ఐ. విద్యా బోధనకు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
ఖమ్మం జిల్లాలో 7 ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పైలెట్ ప్రాజెక్టు క్రింద ఏ.ఐ. విద్యా బోధనను ప్రారంభిస్తున్నామని, ఖమ్మం అర్బన్ ప్రాంతంలో నాలుగు పాఠశాలలు, నేలకొండపల్లి మండలం సింగిరెడ్డి పాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, ఎన్టీఆర్ నగర్ లలో ప్రాథమిక పాఠశాలలో ఈ బోధన ఏర్పాటు చేశామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో ఏఐ పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలతో ఏ.ఐ. ద్వారా తెలుగు చదివించి వాటి అర్థం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి కె. రవి కుమార్, ఎం.ఈ.ఓ. శైలజా లక్ష్మీ, జి.సి.డి.ఓ. తులసి, పాఠశాలప్రధానోపాధ్యాయులు బుర్రి వెం ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.