ప్రస్తుతకాలంలో వాషింగ్ మెషీన్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తేనే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- కాస్త గట్టి వస్తువులు, సున్నితమైన వస్తువుల్ని జిప్‌లాక్ ఉన్న మెష్ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేయాలి. తద్వారా అటు అవి, ఇటు వాషింగ్ మెషీన్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తపడచ్చు.
- చాలావరకు చల్లటి లేదా గోరువెచ్చటి నీటిని ఉపయోగించడమే మంచిది. అలాగే ‘క్విక్ వాష్’ ఆప్షన్ ఎంచుకుంటే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
- అన్ని వస్తువులకు గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్/లిక్విడ్ ఉపయోగించడం ఉత్తమం. మరీ సున్నితమైన వస్తువులైతే క్యాస్టుల్‌సోప్ లిక్విడ్‌ని వాడచ్చు.
- కొన్ని వస్తువుల నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు వాష్‌సైకిల్‌లో అరకప్పు వైట్ వెనిగర్ వేస్తే సరిపోతుంది.
- పిల్లలు ఆడుకునే సాఫ్ట్ టాయ్స్, క్లాత్ లేదా ఫర్ మెటీరియల్‌తో తయారు చేసిన బొమ్మలు త్వరగా మురికి పడతాయి. వాటిని కూడా మెష్ బ్యాగ్‌లో వేసి ‘క్విక్ వాష్’ ఆప్షన్ ఎంచుకుంటే కొత్తగా మెరిసిపోతాయి.
- అయితే వేటిని ఉతకాలన్నా ముందు వాటిపై ఉండే వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను గమనించి వాటికి తగినట్లు ఉతకాలి.