calender_icon.png 19 October, 2024 | 5:57 PM

ఈనాటి ప్రేమలకు నా నిర్వచనమే ఉషా పరిణయం

29-07-2024 12:05:00 AM

దర్శకుడు విజయ్ భాస్కర్ 

‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించారు దర్శకుడు కె.విజయ్ భాస్కర్. తాజాగా ఆయన దర్శకత్వంలో మరో చిత్రం రాబోతోంది. ఆ సినిమానే ‘ఉషా పరిణయం’. లవ్ ఈజ్ బ్యూటీఫుల్ అనేది ఉప శీర్షిక. లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్య తారలు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. ‘నేను ప్రేమకు ఇచ్చే నిర్వచనంమే ‘ఉషా పరిణయం’. ఈ మధ్య ప్రేక్షకు అర్థం మారిపోయింది. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు పెరిగిపోయాయి. అసలు అది ప్రేమ కాదు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ప్రేమోన్మాదం అని రాస్తున్నారు.. అలా రాయకండి.. అది కేవలం ఉన్మాదమే. అలాంటివాడు శాడిస్టు మాత్రమే కానీ, లవర్ కాదు. హింసాత్మకంగా ఉంటే అది ప్రేమే కాదు. ప్రేమ అలా మారిపోయింది.

ఈ పాయింట్‌తో ఓ కథ చెప్పాలనుకున్నా, చెప్తున్నా. ప్రేమ అలా కాదు ఇలా ఉంటే బాగుంటుందంటూ నా స్టుల్‌లో చెప్తున్నా. ఇది మెస్సేజ్‌లా ఉండదు.. ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. అండర్ కరెంట్‌తో ట్రూలవ్‌ను చూపించబోతున్నా. నా తనయుడు కమల్ ‘జిలేబి’ తర్వాత తనకు తగ్గ కథతో సినిమా చేయాలని అడిగాడు. ఇది అతని వయసుకు మ్యాచ్ అయ్యే కథ అనిపించింది. ఆయన కెరీర్‌కు ఈ మూవీ మంచి అవకాశం. ఈ సినిమాతో తాన్వీ ఆకాంక్ష అనే తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ‘జై చిరంజీవ’ టైమ్‌లో నేను రిజెక్ట్ చేసిన బాలనటి ఈమే. వీరిద్దరి ఈ సినిమా చేస్తుంటే ‘నువ్వు నాకు నచ్చావ్’ జానర్‌లో చిత్రం చేసిన ఫీల్ కలిగింది” అని వివరించారు. ఇంకా సినిమా టైటిల్ జస్టిఫికేషన్ గురించి చెప్తూ.. “నాకు ఎప్పట్నుంచో ఈ టైటిల్‌తో సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఇన్నాళ్లకు కుదిరింది. మూవీలో హీరోయిన్ పేరు ఉష. కథంతా ఆమె పెళ్లి గురించే. ఇంతకు ముందు లవ్ ఎమోషన్స్ ఎంతో సున్నితంగా ఉండేవి. ఓటీటీల ప్రభావం ఏంటో కానీ, ప్రేమకథల్లో ఆ సున్నితత్వం పోయింది” అని చెప్పారాయన.