ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదివాసి, గిరిజన జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి(USFI State President Tatikonda Ravi) అన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసే వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఆదిలాబాద్ లో బుధవారం నిర్వహించారు.
దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన తాటికొండ రవి మాట్లాడుతూ... ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పేరుకు మాత్రమే గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించారు, తప్ప దాని అభివృద్ధి చేయడంలో విఫలమైందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను మొత్తం కార్పొరేట్ శక్తుల కట్టబెట్ట కుట్ర చేస్తుందని తక్షణమే నూతన జాతీయ విద్యా అమలు చేయడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి అల్తాఫ్, ఆత్రం నాగేష్ , షేక్ అల్టాఫ్, ఖాసీఫ్, శామీర్, రమేష్ నాయకులు ఉన్నరు