calender_icon.png 17 January, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరబిందో ఫార్మా క్యాన్సర్ డ్రగ్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి

06-12-2024 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 5: యూఎస్‌లో క్యాన్సర్ చికిత్సా ఔషధాన్ని తమ సబ్సిడరీ మార్కెట్ చేసేందుకు యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతి లభించిందని అరబిందో ఫార్మా గురువారం తెలిపింది. దీనితో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అరబిందో ఫార్మా సబ్సిడరీ యూగియా స్పెషాలిటీస్ పజోపానిబ్ ట్యాబ్లెట్లను (200 ఎంజీ) తయారుచేసి, యూఎస్ మార్కెట్లో విక్రయించగలుగుతుంది. ఈ డ్రగ్ నోవార్టీస్ ఫార్మా కార్పొరేషన్ వోట్రియంట్ ట్యాబ్లెట్లకు సమానమని అరబిందో ఫార్మా తెలిపింది.