calender_icon.png 11 March, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో ‘సారీ’ ఎక్స్

10-03-2025 11:33:58 PM

న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్ల్లాట్‌ఫాం ఎక్స్ సోమవారం యూజర్లకు చుక్కలు చూపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఎక్స్ డౌన్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. మధ్యాహ్నం 3.30, రాత్రి 7, 8.44 సమయంలో మరోసారి ఎక్స్ డౌన్ అయింది. అనేక ప్రాంతాల్లో సేవల్లో అంతరాయం ఏర్పడింది. యాప్, వ్బుసైట్ సేవల్లో అంతరాయాలను గుర్తించారు. వరుస అంతరాయాలతో యూజర్లు అసహనానికి గురయ్యారు. ఇంత మంది ఫిర్యాదులు చేసినా కానీ కంపెనీ నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించగా.. చాలా మంది యూజర్లకు ప్లాట్‌ఫాం ఓపెన్ కాలేదు.