calender_icon.png 29 September, 2024 | 7:02 AM

పనికిరాని పంతుళ్లు!

29-09-2024 01:06:38 AM

  1. సమయానికి రారు.. వచ్చినా ఉండరు
  2. సమాచారం లేకుండా విధులకు డుమ్మా 
  3. పిల్లలుంటే సార్లుండరు.. సార్లుంటే పిల్లలులేరు
  4. ఎంఈవోల రాకతోనైనా చక్కబడేనా?

సూర్యాపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి)/సూర్యాపేట: సమాజాన్ని తీర్చిదిద్డ డంలో ఉపాధ్యాయుల పాత్రే కీలకం. అయి తే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడులకు డుమ్మా కొడుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతున్నది.

సూర్యాపేట జిల్లాలో మొత్తం 182 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 78 ప్రాథమికోన్నత పాఠశాలలు, 690 ప్రాథమిక పాఠశాలలు, మోడల్ స్కూల్‌లు 9, కేజీబీవీలు 18, రెసిడెన్షియల్  స్కూల్‌లు రెండు ఉన్నారు.

మొత్తం 979 పాఠశాలల్లో సుమారుగా 3,200 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా హాజరుకాకపోవడం, కొందరు సమయానికి రాకపోవడం, వచ్చినా తొందరగా వెళ్లిపోతుండటంతో విద్యాబోధన అటకెక్కుతున్నది. 

అసలు సమస్య ఎక్కడంటే 

గతంలో జిల్లాలో మూడు, నాలుగు మండలాలకు ఒక మండల విద్యాధికారి ఉండటంతో బడులలో పర్యవేక్షణ కరువై ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. దీంతో పిల్లల్లో క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది.

అలాగే ఉపాధ్యాయుల ప్రవర్తనా తీరును ఎంఈవోలకు ఎవరైనా చెబితే.. ప్రజాప్రతినిధులతో, రాజకీయ నాయకులతోనో ఎంఈవోలతో మాట్లాడించి సెటిల్ చేసుకునేవారు. లేదంటే వ్యక్తిగతంగా ఎంతో కొంత ఆశజూపి తమపై చర్యలు లేకుండా చూసుకునేవారు. ఈ కారణంగానే పాఠశాలల్లో సమస్య మొదలయినట్లు తెలుస్తున్నది.  

ఇద్దరు ఉన్న చోట డ్యూటీ షిప్ట్? 

జిల్లాలో 50కి పైగా ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు కంటే తక్కువ విద్యార్థులు ఉండగా ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయులు షిఫ్ట్ పద్ధతిలో డ్యూటీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరిలో రోజుకొక్కరు చొప్పున హాజరువుతున్నట్టు తెలుస్తున్నది. 

ఏకోపాధ్యాయుల డుమ్మా!

పలు పఠాశాలల్లో ఏకోపాధ్యాయుడు ఉన్నా విధులకు డుమ్మా కొడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకోపాధ్యాయులు సెలవు పెట్టిన రోజు ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను పాఠశాలకు పంపగా వారు సమయానికి ముందే వెళ్లిపోతున్నారని స్థానికుల ద్వారా తెలుస్తున్నది. దీంతో జిల్లాలో ఉదయం ప్రార్థన చేయని పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.

సదువు చక్కగా సాగేనా? 

మండల విద్యాధికారులు సరిపడా లేకపోవడంతో జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక విద్యాధికారిని నియమించింది. దీంతో పర్యవేక్షణ తేలికైపోతుంది. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను పరిశీలించి గాడి తప్పిన వ్యసస్థను గాడిలో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడి ఎదురుచూపు

గరిడేపల్లి మండలంలోని రేగులగడ్డతండాలో ప్రాథమిక పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు హాజరుకాగా పిల్లలు ఒక్కరు కూడా రాలేదు. అనంతగిరి మండలం అజ్మీరాతండా పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు నలుగురు హాజరుకాగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఒక్కరే వచ్చారు. కొత్త్తగూడెంలో ఇద్దరు విద్యార్థులకు ఒక టీచర్ హాజరయ్యారు.

శాంతినగర్‌లో వందమంది విద్యార్థులకు 14 మంది హాజరుకాగా ఐదుగురు ఉపాధ్యాయులకు గాను ఇద్దరు సెలవులో ఉండగా ముగ్గురు హాజరయ్యారు. మునగాల మండలం వెంకట్రామాపురంలో 22 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒక్కరు హాజరయ్యారు.

మునగాల మండల కేంద్రంలో 12 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒక్కరే హాజరయ్యారు. తిరుమలగిరి మండలం లాక్యతండాలో ఇద్దరు విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. తుంగతుర్తిలో దేవునిగుట్టతండాలో ముగ్గురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు హాజరయ్యారు. 

సమయానికిరాని సార్లు

సర్కారు బడుల్లో సార్లు సమయాని కిరారు. వచ్చినా ఉండరు అనేది ‘విజయక్రాంతి’ శనివారం ప్రభుత్వ పాఠశా లలను సందర్శించగా నిజమేనని తేలింది. జిల్లాలోని పలు ప్రాథమిక పా ఠశాలలను ఉదయం 10 గంటల నుం చి మధ్యాహ్నం వరకు విజిట్ చేసింది. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు అసలు హా జరుకాకపోవడం గమనార్హం.

ఉదయం 10 గంటలైనా గరిడేపల్లి మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల తెరుచుకోలేదు. పెన్‌పహాడ్ మండలం న్యూబం జారాహిల్స్‌లో ఉపాధ్యాయులు, విద్యా ర్థులు ఎవరూ హాజరుకాలేదు. ఎల్లప్ప కుంటతండాలో ప్రాథమిక పాఠశాలకు పిల్లలు వచ్చినా ఉపాధ్యాయుడు రాలే దు. దీంతో విద్యార్థులు బయటే తిరుగు తూ కనిపించారు.

తిరుమలగిరి మండలంలో గల రాజనాయక్‌తండాలో ఒక్క విద్యార్థికి, ఒక ఉపాధ్యాయుడు ఉండగా ఇద్దరూ పాఠశాలకు రాలేదు. చివ్వెంల మండలం బడి తండాలో ఒక ఉపాధ్యాయుడు విధులకు రాగా.. అక్కడ ఒక్క వి ద్యార్థి కూడా హాజరుకాలేదు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో సుమారు 50కి పైనే ఉన్నాయి.