calender_icon.png 23 March, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిని పొదుపుగా వాడండి..!

22-03-2025 08:32:48 PM

అశ్వరావుపేట అగ్రికల్చర్ విద్యార్థుల సూచన..

వైరా (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ జల వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. వల్లాపురం గ్రామంలో అగ్రికల్చర్ విద్యార్థులు అగ్రికల్చర్ విద్యార్థులు ఏ అక్షిత, హెచ్ చిన్నారి ఎం అఖిల ఎం భవాని నేహా పిర్దోస్ ఆర్ సలోమి లు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులతో కలిసి నీటిని పొదుపుగా వాడుకుంటామని ప్రమాణం చేశారు. అనంతరం ప్రపంచంలో నీటి ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్తమ రైతు రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.