calender_icon.png 18 November, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటళ్లలో సింథటిక్ కలర్ల వినియోగం

05-08-2024 12:55:52 AM

  1. కాలం చెల్లిన సాస్, మసాలాలు, నకిలీ టీ పౌడర్లు వాడుతున్నట్లు వెల్లడి 
  2. హోటళ్ల యాజమాన్యాలపై కేసులు నమోదు

రాజేంద్రనగర్, ఆగస్టు 4: శంషాబాద్‌లోని పలు హోటళ్లలో సింథటిక్ కలర్లు వినియోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడయ్యింది. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఆదివారం ఎయిర్‌పోర్టు బావర్చీ, హోటల్ హైదరాబాద్ గ్రాండ్ అదేవిధంగా ఎస్ బావర్చీ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ గ్రాండ్‌లో కాలం చెల్లిన ఫుడ్ సాస్, ఇతర మసాలా, కోకనట్ మిల్క్, రోజ్ వాటర్, రెడ్ చిల్లీసాస్ తదితరాలు వాడుతున్నట్లు తనిఖీల్లో తేలింది.

అలాగే ఇక్కడ వాడుత్ను 20 కేజీల నకిలీ టీ పౌడర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ బావర్చీ మల్టీ కజిన్ రెస్టారెంట్‌లో నాణ్యత లేని నీళ్లు విక్రయిస్తుండగా.. ఎస్ బావర్చీ రెస్టారెంట్‌లో సింథటిక్ కలర్లు వినియోగిస్తున్నట్లు తేలింది. అదేవిధంగా ఎయిర్‌పోర్టు బావర్చీలో కూడా సింథటిక్ కలర్లు వినియోగిస్తున్నారు. ఆయా హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.