calender_icon.png 5 October, 2024 | 8:49 AM

తక్షణశక్తిని పొందేందుకు స్లున్ల వాడకం

05-10-2024 01:39:36 AM

చైనా, దక్షిణకొరియా ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్

-న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దక్షిణకొరియా, చైనాల్లో ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. విధుల్లో పూర్తిగా అలిసిపోతున్న ఉద్యోగులు.. విశ్రాంతి ద్వారా కోలుకునేందుకు టైమ్ పడుతుందని స్లున్లు(ఐవీ) ఎక్కించుకొని తక్షణ శక్తిని పొందుతున్నారు. ఈవిషయాన్ని తాజాగా సౌత్ చైనా మార్నిం గ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.

ఈ ఐవీ విధానంలో కొన్ని లిక్విడ్ విటమిన్లను స్లున్లతో కలిపి నేరుగా శరీరంలోకి ఎక్కించు కుంటున్నారని వెల్లడించింది. ఈ చికిత్సను అంతకుముందు క్యాన్సర్, కీళ్ల ఆరోగ్యం చికిత్సలో వాడేవారు. తాజాగా ఇప్పుడు దీన్ని కృత్రిమంగా శరీర అవసరాలను తీర్చేందుకు వాడుతున్నారు. మెడికల్ అస్థెటిక్స్ న్యూస్ అనే సంస్థ దక్షిణ కొరియాలో సౌందర్య పరిశ్రమపై దృష్టిసారించినప్పుడు ఈ విషయం తెలిసింది.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని క్లినిక్‌లలో ఈ స్లున్లను ఎక్కించేం దుకు 25,000 వోన్‌లు వసూలు చేస్తున్నారు. ఇది మన కరెన్సీలో రూ.1,500 నుంచి 3,600 వరకు ఉంటుంది. వీటిల్లో సిండ్రిల్లా, గార్లిక్, ప్లసెంటా డ్రిప్స్ అనే రకాలను అందుబాటులోకి తెచ్చాయి. గార్లిక్ రకంలో బీ1 వంటి విటమిన్లు ఉన్నాయి. నిద్రలేమితో బాధపడే వారికోసం దీన్ని అందిస్తున్నారు.