calender_icon.png 26 April, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రగతి స్కూల్.. మజాకా..

25-04-2025 06:56:03 PM

దర్జాగా పార్క్ స్థలం వాడకం..

నిరుపయోగంగా స్విమ్మింగ్ పూల్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ లోని సర్వేనెంబర్ 178, 179 నందు దాదాపు రెండు ఎకరాల పైచిలుకు స్థలంలో పార్క్ ఉండేది. కానీ ప్రగతి సెంట్రల్ పాఠశాల యాజమాన్యం పార్కు స్థలాన్ని దశాబ్ద కాలంగా సొంత స్థలం లాగా ప్లే గ్రౌండ్, బస్సులు, టూ వీలర్స్ పార్కింగ్ గా వాడకం దారుణమని నిజాంపేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్(Former Nizampet BJP President Akula Satish) ఆరోపించారు. పార్కు స్థలంను ప్రగతి స్కూల్ కబ్జా పై శుక్రవారం ఆకుల సతీష్ పరిశీలించారు. ప్రగతి స్కూల్ కబ్జా పై గతంలో 2021 లో తాము ఫిర్యాదు చేయగా అప్పటి కమిషనర్ పార్క్ స్థలానికి కాంపౌండ్ వాల్, వాకింగ్ ట్రాక్, గేటు పెట్టడం జరిగిందని తెలిపారు.

గత సంవత్సర కాలంగా మళ్లీ ప్రగతి సెంట్రల్ స్కూల్ కు చెందిన బస్సులు, టూ వీలర్స్ పార్క్ చేసుకోవడమే కాకుండా, గతంలో మున్సిపల్ కమిషనర్ గోపి అభివృద్ధిలో భాగంగా గేటు, వాకింగ్ ట్రాక్  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్  మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా పార్కులో మొత్తం మట్టితో నింపడం, మళ్లీ పార్క్ లో  ప్రగతి సెంట్రల్ స్కూల్ వాహనాలు పార్క్ చేయడమే కాకుండా మెయిన్ గేటు విరగొట్టడం, అక్రమంగా పార్కు స్థలం వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు.

ప్రస్తుత నిజాంపేట్ కమిషనర్ తక్షణమే అక్రమంగా పార్కును వినియోగించుకుంటున్న ప్రగతి సెంట్రల్ స్కూల్ పై చర్యలు తీసుకొని, పార్కు అభివృద్ధి చేయాలనీ అలాగే సిమ్మింగ్ పూల్ ని వాడకంలోకి తేవాలని, పార్కులు అన్యాక్రాంతం కాకుండా కమిషనర్ కనీసం చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ల స్వామి, అరుణ్ రావు, మధు, శివ, కురుమూర్తి, రాజు, రవి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.