calender_icon.png 10 March, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధార్ సేవలు వినియోగించుకోండి

10-03-2025 05:26:15 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గుండి రోడ్డులో గల తపాలా శాఖ కార్యాలయంలోని ఆధార్ సెంటర్ ద్వారా వినియోగదారులు సేవలను వినియోగించుకోవాలని పోస్టుమాస్టర్ యోగేష్ కుమార్ తివారి తెలిపారు. ఈ ఆధార్ కేంద్రంలో ఆధార్ లో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, ఇతర సవరణలు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.