calender_icon.png 5 May, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

21-04-2025 09:57:39 AM

న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(US Vice President JD Vance) సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. వాన్స్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. జేడీ వాన్స్ తో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా ఉన్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. జేడీ వాన్స్ దంపతులకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వాగతం పలికారు. అమెరికా ఉపాధ్యక్షుడి విమానం న్యూఢిల్లీలోని పాలం టెక్నికల్ ఏరియాలో దిగింది.  ఈ నెల 24 వరకు జేడీ వాన్స్ దంపతులు భారత్ లో పర్యటించనున్నారు.  భారత్ లోని పలు చారిత్రక ప్రదేశాలు వాన్స్ కుటుంబం సందర్శించనుంది. సాయంత్రం అక్షర్ థామ్ ఆలయాన్ని జేడీ వాన్స్ సందర్శించనున్నారు. ఢిల్లీలోని చేనేత ఉత్పత్తుల దుకాణాలను కూడా ఆయన సందర్శించనున్నారు.

సాయంత్రం 6.30 గంటలకు తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)తో భేటీ కానున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా పాల్గొంటారని భావిస్తున్నారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో జేడీవాన్స్ చర్చించనున్నారు. చర్చల తర్వాత జేడీ వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రేపు జయపురలో చారిత్రక ప్రదేశాలు వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ప్రధాని మోదీతో సమావేశం తర్వాత ఏవైనా కీలక ప్రకటనలు వెలువడతాయని అధికారులు ఆశిస్తున్నారు. వాటిలో ట్రస్ట్ (ట్రాన్స్‌ఫార్మింగ్ రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ) భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రారంభించడం కూడా ఉంది. ఇది మునుపటి బైడెన్ పరిపాలనతో కూడిన ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (Initiative on Critical and Emerging Technologies) నుండి పేరు మార్చబడింది.