న్యూయార్క్, నవంబర్ 23: సోలార్ పవర్ కాంట్రాక్టుల్ని పొందేందుకు ఇండియా లో రూ.2,200 ముడుపుల్ని చెల్లించారం టూ అమెరికాలో అభియోగాల్ని ఎదుర్కొం టున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కొడుకు సాగర్ అదానీలకు యూఎస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్ (సెక్) సమ న్లు జారీచేసింది.
సమన్లను శనివారం గౌతమ్ అహ్మదాబాద్‌లోని అదానీ నివాసం శాంతివనం ఫార్మ్ రెసిడెన్స్‌కు, అదే నగరం లోని సాగర్ నివాసం ఉంటున్న బొడక్‌దేవ్ రెసిడెన్స్‌కు పంపింది. సమన్లు జారీ అయిన 21 రోజుల్లోగా (సమన్లు స్వీకరించిన రోజు నుంచి కాదు) ముడుపుల ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సెక్ పేర్కొంది.
‘సమాధానం ఇవ్వకపోతే తీర్పు మీకు వ్యతి రేకంగానే నమోదవుతుందని, మీరు తప్పని సరిగా జవాబు ఇవ్వాలని లేదంటే కోర్టు మోషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని’ సెక్ అదానీలకు పంపిన సమన్లలో హెచ్చరిం చింది. యూఎస్ న్యాయశాఖ ఫిర్యాదుపై విచారణ అనంతరం న్యూయార్క్ కోర్టు గౌత మ్, సాగర్‌లపై రెండు రోజుల క్రితం అరెస్ట్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే.
ఇండి యాలో ముడుపులు ఇచ్చి, పొందిన కాం ట్రాక్టులు, వాటి ద్వారా భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాలను చూపించి యూఎస్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్టర్ల నుంచి 2 బిలియన్ డాలర్లు, బాండ్ల విక్రయం ద్వారా 1 బిలియ న్ డాలర్లు సమీకరించారని ఆరోపిస్తూ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్ అదానీలపై మరో కేసు నమోదు చేసింది.