calender_icon.png 5 November, 2024 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. హారిస్‌, ట్రంప్‌ మధ్య హోరాహోరీ

05-11-2024 09:49:40 AM

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నేడు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అమెరికా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. ట్రంప్ రెండో సారి అధికారాన్ని ఎలాగైనా సాధించాలనే కసితో ఉన్నారు. అటు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించేందుకు హారిస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 6.8 కోట్ల మది ఇప్పటికే ముందస్తు ఓటు హక్కునును వినియోగించుకున్నారు. తటస్థ ఓటర్లు ఎవరివైపు మొగ్గితే వారికే విజయం దక్కుతోంది. స్వింగ్ స్టేట్స్ లో హారిస్ కంటే ట్రంప్ 1.8 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షులుగా ఎవరు గెలుస్తారని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.