హైతీ, నవంబర్ 12: హైతీలో అమెరికా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.పోర్ట్ ఔ ప్రిన్స్‌లో విమానం ల్యాండ్ అవుతుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. సిబ్బంది ఒకరు గాయపడ్డారు. స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పోర్ట్ ఔ ప్రిన్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే అప్పటికే ఈ ప్రాంతంలో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్న ట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
హైతీలో రాజకీయ అనిశ్చితి..
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న హైతీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. తాత్కాలిక ప్రధానిగా ఉన్న గేరీ కోనిల్‌ను తొలగించి.. ఆయన స్థానంలో బిజినెస్‌మెన్ అలిక్స్ డిడియర్‌ను మంత్రిమండలి ప్రధానిగా ఎన్నుకుంది. దీనిని స్థానికంగా ఉండే కొన్ని సమూహా లు (గ్యాంగ్‌లు) వ్యతిరేకించాయి. రాజధా ని వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగా యి. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పరిస్థితులు మరింత చేజారాయి.