06-04-2025 11:41:37 PM
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిపై కన్నెర్ర చేశారు. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన వారిని ప్రత్యేక ఫ్లైట్లు కేటాయించి మరీ.. వారి వారి దేశాలకు చేరవేశారు. అలా స్వస్థలాలకు చేరుకున్న వారిని అక్కున చేర్చుకునేందుకు అఫ్రికన్ దేశాలు నిరాకరిస్తున్నాయి. దీంతో ట్రంప్ సీరియస్‌గా స్పందించారు. ఆయా దేశాల పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీసాలు రద్దు చేయిస్తున్నారు. చర్యలపై తాజాగా యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ.. ‘అక్రమ వలసల సమస్యను మేం సీరియస్‌గా తీసుకున్నాం. తాజాగా దక్షిణ సూడాన్‌కు చెందిన పలువురి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేశాం. దక్షిణ సూడాన్ విషయంలో కొత్త వీసాల ప్రక్రియను నిలిపివేస్తున్నాం’ అని ప్రకటించారు.