calender_icon.png 16 January, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూఎస్ జీడీపీ 2.8 శాతం వృద్ధి

29-11-2024 12:00:00 AM

వాషింగ్‌టన్, నవంబర్ 28: యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) 2.8 శాతం వృద్ధిచెందింది. వినియోగ కొనుగోళ్ళు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడంతో జీడీపీ 2.8 శాతం వృద్ధిచెందిందని యూఎస్ ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. గత తొమ్మిది త్రైమాసికాల్లో ఎనిమిదింటిలో యూఎస్ 2 శాతంపైగా వృద్ధి సాధించింది.

ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో 2.7 శాతం ఆర్థికాభివృద్ధిని సాధించింది. ఒకవైపు అక్టోబర్ నెలలో పీసీఈ ద్రవ్యోల్బణం పెరగడం, మరోవైపు క్యూ3లో జీడీపీ వృద్ధి అంచనాలను మించి పుంజుకోవడంతో ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్ల కోతల పట్ల మార్కెట్లో అనుమానాలు తలెత్తాయి.