calender_icon.png 24 December, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ జోరు

06-11-2024 09:51:14 AM

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. హెరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో 22 రాష్ట్రాల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా, 11 రాష్ట్రాల్లో కమలా హరిస్ విజయం సాధించారు. అమెరిక ఎన్నికల ఫలితాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు

అలబామా(9), ఆర్కాన్సాస్(6), ఫ్లోరిడా(30), ఇండియనానా(11), కెంటకీ(8), లూసియానా(8), మిసిసిపి(6), నార్డ్ డకోటా(3), నెబ్రాస్కా(5), ఒహాయో(17), ఓక్లహోమా(7), సౌత్ కరోనలినా(9), సౌత్ డకోటా(3), వెస్ట్ వర్జీనియా(4), టెన్నెసీ(11), వయోమింగ్(3), టెక్సాస్(40), విస్కోరి(10), యుటా(6), మోంటానా(4), కాన్సస్(6), అయోవా(6) ఈ రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపొందారు.

హారిస్ గెలిచిన రాష్ట్రాలు

కనెక్టికట్(7), డెలవేర్(3), ఇల్లినోయీ(19), మసాచుసెట్స్(11), మేరీల్యాండ్(10), న్యూయార్క్(28), రోడ్ ఐల్యాండ్(4), వెర్మాంట్(3), కొలరాడో(10), న్యూజెర్సీ(14), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా(3), మైన్(4).

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 స్వింగ్ రాష్ట్రాల ఓట్లు కీలకం కానున్నాయి. ఆరు స్వింగ్ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.

స్వింగ్ రాష్ట్రాలు: ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోనలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్.