గురుపత్వంత్ పిటిషన్ మేరకు ఆదేశాలు
వాషింగ్టన్, సెప్టెంబర్ 19: తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్ అమెరికా కోర్టు ను ఆశ్రయించడంతో భారత్ ప్రభుత్వానికి సమన్లు అందాయి. భార త్‌తోపాటు ఎన్‌ఎస్‌ఏ అజిత్‌దోవల్, రా ఏజెంట్ విక్రమ్, రా మాజీ చీఫ్ గోయల్, బిజినెస్‌మ్యాన్ నిఖిల్ పేర్లు ఆ సమన్లలో ఉన్నాయి. 21 రోజుల్లో సమాధానం ఇవ్వాలని దానిలో పేర్కొన్నారు. అమెరికాపై పన్ను త్యకు కుట్రను తాము భగ్నం చేశామని ఆ దేశం పేర్కొన్నది. నిఖిల్ సుపారీ ఇచ్చారని ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఈ సమాచారంతోనే నిఖిల్‌ను అరెస్ట్ చేశా మని, ఆ తరువాత అతడిని యూఎస్‌కు అప్పగించామని చెక్ అధికా రులు తెలిపారు. హత్య కుట్ర ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. దర్యాప్తు కూడా ప్రారంభించింది.