16-03-2025 01:31:27 AM
ముసాయిదా విడుదల చేయనున్న విదేశాంగ శాఖ
మూడు గ్రూపులతో వేర్వేరు జాబితాలు సిద్ధం
రెడ్ లిస్ట్‌లో అఫ్గానిస్థాన్
వాషింగ్టన్, మార్చి 15: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలకు చెందిన పౌరులను అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధించే యోచనలో ఉన్న ట్లు తెలుస్తోంది. జాబితాలో పాకిస్థాన్ సహా లలిత్ మోదీకి వీసా జారీ చేసిన వనవాటు దేశం కూడా ఉండడం గమనార్హం. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ముసాయిదాను సి ద్ధం చేసినట్టు రాయిటర్స్ ఒక కథనంలో పేర్కొంది. మొత్తం 41 దేశాలను మూడు గ్రూపులుగా విభజించినట్టు సమాచారం.
పది దేశాలతో ఉన్న మొదటి గ్రూప్‌ను రె డ్ లిస్ట్ జాబితాలో ఉంచింది. రెండో గ్రూ ప్‌లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సుడాన్ దేశాలున్నాయి. వీ టిపై పాక్షిక ఆంక్ష లు అమలు చేయనున్నారని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ దేశాల కు పర్యాటక, విద్యార్థి వీసాలు చేయకూడదని భావిస్తున్నారు. మూడో గ్రూప్‌లో పా కిస్థాన్, భూటాన్ సహా 26 దేశాలు ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరి ంచు కోవడానికి ప్రయత్నాలు చేయకపోతే అ క్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా ని లిపివేయాలని భావిస్తున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు.