calender_icon.png 17 March, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హౌతీలపై అమెరికా భీకర దాడి

17-03-2025 12:32:11 AM

31 మంది మృతి.. 100 మందికి గాయాలు

హౌతీలకు మద్దతు ఉపసంహరించుకోవాలని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

న్యూఢిల్లీ, మార్చి 16: అమెరికా ప్రభుత్వం యెమెన్‌లోని హౌతీలపై శనివారం భారీ స్థాయిలో సైనిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఎర్ర సముద్రంలోని తమ రవాణా నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హౌతీలను ట్రంప్ హెచ్చరించారు.

ఇదే సమయంలో హౌతీలకు మద్దతును ఉపసంహరించుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ‘హౌతీలు మీ సమయం ముగిసింది. ఈ రోజు నుంచే నౌకలపై దాడులను ఆపాలి. ఒక వేళ మీరు దాడులను ఆపకపోతే.. ఇంతకుముందేన్నడూ చూడని విధంగా నరకాన్ని చూడాల్సి వస్తుంది’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో హెచ్చిరించారు.

కాగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిడిల్ ఈస్ట్‌లో అమెరికా జరిపిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలేపై అమెరికా జరిపిన దాడుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా మరణించినట్టు హౌతీ ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం జరిపిన దాడులను హైతీ పొలికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. అంతేకాకుండా అమెరికా దాడులను తిప్పికొట్టేందుకు హౌతీ ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటించింది.