calender_icon.png 29 April, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు

29-04-2025 01:24:13 AM

68 మంది మృతి.. 47 మందికి గాయాలు

సనా, ఏప్రిల్ 28: యెమెన్‌లోని హౌతీ రెబల్స్, అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్‌లోని ఒక జైలు లక్ష్యంగా అమెరికా కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 68 మంది మృతి చెందగా.. 47 మంది గాయపడినట్టు సమాచారం. యెమెన్‌లో సాదా గవర్నరేట్స్‌లో అమెరికా వైమానిక దాడులు చేసిందని హౌతీలు తెలిపారు.

ఆఫ్రికన్ వలసదారులు ఉన్న జైలుపై ఈ దా డి జరిగిందన్నారు. ఈ జైలులో దాదాపు 115 మంది ఖైదీలు ఉన్న ట్టు తెలుస్తోంది. అయితే తాజా దా డిపై అమెరికా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చే యలేదు. యెమెన్ రాజధాని సనాలోనూ జరిగిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మార్చి నుంచి ఇప్పటివరకు యెమెన్‌పై జరిపిన దాడుల్లో 800కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు ఇటీవల అమెరికా  ప్రకటిం చింది. హౌతీ రెబెల్స్‌కు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, అధునాతన ఆయుధాల తయారీ సౌకర్యా లు, నిల్వ స్థావరాలు నాశనం అ య్యాయని అమెరికా పేర్కొంది.