సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
ఇండోర్: గుజరాత్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ టీ20ల్లో ప్రపం చ రికార్డు నెలకొల్పా డు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 28 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృ ష్టించాడు. 35 బంతుల్లో 12 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 113 పరు గులతో అజేయంగా నిలిచాడు.
ఫలితంగా గుజరాత్ 156 పరుగుల లక్ష్యాన్ని 10.2 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 2018 సయ్యద్ ముస్తాక్ టోర్నీలో రిషబ్ పంత్ 32 బంతుల్లో నెలకొల్పిన రికార్డు శతకం కనుమరుగయ్యింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో భా రత్ తరఫున ఉర్విల్‌ది అత్యంత వేగవం తమై న శతకం కాగా.. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ.
తొలి స్థానంలో ఎస్తో నియాకు చెందిన సాహిల్ చౌహాన్ (27 బం తుల్లో) ఉన్నాడు. కాగా ఐపీఎల్ మెగావేలం లో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
చెలరేగిన శ్రేయస్, రహనే
హైదరాబాద్: ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అజింక్య రహనే అర్ధ శతకాలు బాదడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై మహారాష్ట్ర మీద 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్దిక్ పాండ్యా (69) విరుచుకుపడడంతో బరో డా తమిళనాడు మీద మూడు వికెట్ల తేడాతో విజయబావుటా ఎగరేసింది.
రజత్ పాటిదార్ (62), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (60) రెచ్చిపోవడం తో మధ్యప్రదేశ్ 188/8 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో పంజాబ్ 179కే పరిమితం కావడంతో.. ఎంపీ 9 పరుగుల తేడాతో పంజాబ్ మీద విక్టరీ కొట్టింది. పంజాబ్‌లో యువ సంచలనం అభిషేక్ శర్మ (61) చెలరేగినా కానీ పంజాబ్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.