calender_icon.png 3 October, 2024 | 5:48 AM

ఊరూరా ఎంగిలిపూల బతుకమ్మ

03-10-2024 12:55:35 AM

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పల్లెలన్నీ పూలవనాలుగా మారాయి. బతుకమ్మలను ప్రధాన చౌరస్తాల వద్ద ఉంచి మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ ఆడారు. 

హైదరాబాద్, అక్టోబర్ 2(విజయక్రాంతి): బతకుమ్మ ఉత్సవాలను తొమ్మి దిరోజుల పాటు హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో నిర్వహించాలని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఎంగిలిపూల బతుకమ్మను రవీ ంద్రభారతి ప్రాంగణంలో నిర్వహించారు. మిగత ఎనిమిది రోజుల షెడ్యూల్‌ను వెల్లడించారు. అరుణోదయ విమలక్క సూచన లు, సలహాలను తీసుకొని ఈ షెడ్యూల్‌ను ఖారారు చేసినట్లు తెలిపింది.

చెరువులను శుద్ధిచేసే పండగే బతుకమ్మ: సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 2(విజయక్రాంతి): బతుకమ్మ పండగతో చెరువులకు ప్రత్యేక అనుబంధం ఉంటుందని, చెరువులను శుద్ధి చేసే పండుగే బతుకమ్మ అని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్‌లో సరస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సీతక్క పాల్గొని మాట్లాడారు.

ప్రభు త్వం తరఫున 9 రోజులపాటు జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పసుపుతో చేసిన గౌరమ్మ, తంగేడు పువ్వుల్లో ఉండే యాంటీబయోటిక్స్ చెరువులను శుద్ధిచేస్తాయని పేర్కొన్నారు.

బతుకమ్మ పండగలో భాగంగా సాగే ఆటపాటలతో మానసికంగా ఉల్లాసంగా ఉంటామన్నారు. చప్పట్ల ద్వారా నాడీ వ్యవస్థ, పాటలతో గొంతుకు తగిన వ్యాయా మం లభిస్తుందన్నారు. ఒకప్పుడు బతుకమ్మ పండగ వచ్చిందంటే ఆడపడుచులు తల్లిగారిళ్లకు వెళ్లేవారని మంత్రి సీతక్క గుర్తు చేసుకున్నారు. 

రవీంద్రభారతీలో బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్ 

తేదీ వేడుక పేరు కార్యక్రమం

03-10-2024 అటుకుల బతుకమ్మ బతుకమ్మ పాటలతో వేడుక

04-10-2024 ముద్దపప్పు బతుకమ్మ బతుకమ్మపై కవిసమ్మేళనం, 

కాళీ-భద్రకాళి పేరిణి నృత్య రూపకం

05-10-2024 నానబియ్యం బతుకమ్మ యువతుల బతుకమ్మ ఆటా,పాట 

06-10-2024 అట్ల బతుకమ్మ ఎస్పీ బాలు స్వర నిరాజనం, 

బతుకమ్మ నిరాజనం

07-10-2024 అలిగిన బతుకమ్మ బతుకమ్మ-పర్యావరణ ప్రభావం, 

మహిళల భద్రత, చెరువుల సంరక్షణపై 

విమలక్కతో చర్చా కార్యక్రమం

08-10-2024 వేపకాయల బతుకమ్మ యువతుల బతుకమ్మ ఆటా-పాట, 

తెలంగాణ సంగీత నాటక అకాడమీ, 

భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో 

నాట్య, సంగీత, నాటక కార్యక్రమాలు.

09-10-2024 వెన్నె ముద్దల బతుకమ్మ యువతుల బతుకమ్మ ఆటా-పాట, 

తెలంగాణ సంగీత నాటక అకాడమీ, 

భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో 

నాట్య, సంగీత, నాటక కార్యక్రమాలు.

10-10-2024 సద్దుల బతుకమ్మ విమలక్క ఆధ్వర్యంలో బతుకమ్మ పూజ.. 

అమరవీరుల స్థాపం నుంచి ట్యాంక్ బండ్‌కు 

వెయ్యిమంది బతుకమ్మలు, జానపద, 

గిరిజన కళాకారులతో ఊరేగింపు.. హాజరు 

కానున్న సీఎం, మంత్రులు.. లేజర్ షో