calender_icon.png 3 April, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరుకొండపేట భూములను కాపాడాలి

03-04-2025 12:11:05 AM

కల్వకుర్తి, ఏప్రిల్ 2: ఊరుకొండపేట మండల ప్రభుత్వ స్థలాలను కాపాడాలని నిరసిస్తూ బుధవారం గ్రామస్థులు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు దుండగులు ఆక్రమించి ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని 401, 404 సర్వే నెంబర్లలో గల భూమిని అప్పటి ప్రభుత్వం గ్రామంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలకోసం ఏర్పాటు చేశారు.

భవిష్యత్ అవసరాల కోసం (ప్లాట్ నెంబర్లు (88, 91, 92, 93, 94) గల ప్లాట్లను గ్రామ పంచాయితీ కోసం ఏర్పాటు చేయగా కొందరు దొంగచాటున పట్టాలను పొంది కబ్జా చేయడమే కాకుండా అక్రమ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారని ఇట్టి విషయంపై కొన్ని రోజులుగా గ్రామ కార్యదర్శి, తాహసిల్దార్, ఎంపీడీవో, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం స్థానిక తహసీల్దార్ కి వినతిపత్రం ఇచ్చారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించక పోతే కలెక్టరెట్ ముట్టడిస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మాజీ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.