ఇల్లెందుకు తరలి వచ్చిన భక్తులు
ఇల్లెందు, డిసెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఏటా నిర్వహించే హజరత్ ఖాసీందుల్లా దర్గా షరీప్ ఉర్సు ఉర్సు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఆదివారం పట్టణంలోని హజరత్ హుస్సేన్ నాల్ఫై దర్ ఆస్థాన్ నుంచి సత్యనారాయణపురచంలోని దర్గాకు పవిత్ర సంధల్ జరఫ్లతో ఊరే గింపుగా తీసుకెళ్లి సమర్పించారు.
ఊరేగింపునకు అడుగడుగునా భక్తులు పవిత్ర జలాల తో స్వాగతం పలికారు. ఈ ఉర్సుకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మతాలకు అతీతంగా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో సత్యనారా యణపురం అటవీ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారింది. ఏటా కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్య రోజున ఉర్సు నిర్వహించడం ఆనవాయితీ. గత 2౨ ఏళ్లుగా ఉర్సు కొనసాగుతున్నది.