calender_icon.png 14 January, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉసికె బావిలో ఉర్సు ఉత్సవాలు

14-01-2025 01:32:43 AM

పటాన్ చెరు, జనవరి 13 : అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉసికెబావిలో హుస్సేని షా బాబా దర్గాలో ఉర్సు ఉత్స వాలు ఘనంగా జరుగుతున్నాయి.  ఆది వారం రాత్రి ఉర్సు ఉత్సవాలలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా దర్గా కమిటీ నిర్వా హకులు శ్రీనివాస్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.

 సంక్రాంతి ముగ్గుల పోటీ

పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం సోమవారం సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి ముఖ్య అతిథులుగా హాజర య్యారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.