calender_icon.png 11 October, 2024 | 5:53 AM

వేతనం అడిగాడని ముఖంపై మూత్రవిసర్జన

11-10-2024 02:04:08 AM

బీహార్‌లో దళిత యువకుడిపై పౌల్ట్రీ యజమాని పైశాచికత్వం

బీహార్, అక్టోబర్ 10: ఉత్తర భారతదేశంలో దళితులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో తాను చేసిన పనికి కూలీ ఇవ్వాలని అడిగినందుకు ఓ దళిత యువకుడిని యజమాని, అతడి కొడుకు దుర్భాషలాడంతో పాటు అతడి ముఖంపై ఉమ్మేయడంతో పాటు మూత్ర విసర్జన చేశారు.

ముజఫర్ నగర్‌లోని రమేష్ పటేల్ పౌల్ట్రీలో పనిచేసే రింకు మాంఝీ తాను చేసిన రెండు రోజుల పనికి కూలీ ఇవ్వాలని అక్టోబర్ 4న పౌల్ట్రీ యజమానిని కోరాడు. దుర్గా పూజ ఉన్నందున ముందుగా వేతనం ఇవ్వాలని అతడు యజమానిని వేడుకున్నాడు.

అయితే మమ్మల్నే వేతనం ఇవ్వమని డిమాండ్ చేస్తావా అని పౌల్ట్రీ యజమాని రమేష్ పటేల్, అతని సోదరుడు అరుణ్ పటేల్, అతని కొడుకు గౌరవ్ కుమార్.. మాంఝీపై తీవ్రంగా దాడిచేయడంతో పాటు అతడిముఖంపై ఉమ్మేసి మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటనకు సంబంధించి అక్టోబర్ 8న బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు.. నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసులు బుక్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.