calender_icon.png 16 April, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో నీటిఎద్దడి కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి

16-04-2025 12:15:32 AM

బిఆర్ ఎస్ పార్టీ విప్,ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): వేసవిలో నీటిఎద్దడి కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలని బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్‌ఎస్ పార్టీ విప్,ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జంట సర్కిళ్లయిన కుత్బుల్లాపూర్, గాజుల రామారం జలమండలి అధికారులతో సమావేశమై జంట సర్కిళ్ల పరిధిలోని వివిధ కాలనీలలో మంచినీటి సరఫరా,నీటి లభ్య త,భూగర్భ డ్రైనేజీ పనులు,నూతన పైప్ లైన్ల నిర్మాణం వంటి వాటిపైసమీక్షను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో జంట సర్కిల్ ల పరిధిలో నీటి సరఫరా,నీటి లభ్యత ను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం కలగకుండా వేసవి చర్యలు చేపట్టాలని, అదేవిధంగా రానున్న  వర్షాకాలం ను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న భూగర్భ డ్రైనేజీ,వరద నీటి కాలువ,మంజీరా పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎంలు రాజేష్,శ్రీకాంత్,రవీందర్ నాయక్,మేనేజర్లు రవి,శివ ప్రసాద్,మహేష్,ఈశ్వరయ్య, రోహిణి,ఝాన్సీ,రమ్య భారతి,పూజిత తదితరులు పాల్గొన్నారు.