calender_icon.png 21 January, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టారాజ్యంగా యూరియా ధర పెంపు వ్యాపారుల దోపిడీ

21-01-2025 01:45:14 AM

  1. నల్లగొండలో యథేచ్ఛగా కోట్ల రూపాయల దందా 
  2. బస్తాకు రూ.80- వరకు అదనం
  3. చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

నల్లగొండ, జనవరి 20 (విజయక్రాంతి): భూమినే నమ్మి ఆరుగాలం శ్రమించే రైతులను నల్లగొండ జిల్లాలో ఫెర్టిలైజర్ దుకాణదారులు దయాదాక్షి ణ్యాలు లేకుండా దోచుకుంటున్నారు. యూరియాను అధిక ధరకు విక్రయిస్తూ వారి కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నా రు.

విక్రయాల తీరును పర్యవేక్షించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటుపడి అంటీముట్టన ట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. కొన్నిచోట్ల వ్యాపారులు యూరియా అమ్మకాలను నిలిపేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో రైతులు అధిక ధరలకు కొనే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు మిన్నకుండటం అనుమానాలకు తావిస్తోంది.

బస్తా రూ.330 వరకు..

వానకాలంలో ఆశించిన మేర వర్షా లు కురిసి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండటంతో యాసంగిలో రైతులు ముందస్తుగా వరిసాగు చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి 5 లక్షల 30 వేల ఎకరాలు వరి సాగు చేయనున్న ట్టు వ్యవసాయ అధికారుల అంచనా. ఇప్పటివరకు 3.5 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి.

ప్రస్తుతం ముందస్తు నాట్లు వేసిన పొలాలకు తొలిదశ యూరియా అందించాల్సి రావడంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఫెర్టిలైజర్ దుకాణాదారులు ధర పెంచి విక్రయి స్తున్నారు. బస్తా రూ.266.50 విక్రయించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదే శాలు ఉన్నా అవేవి పట్టవన్నట్టు రూ. 330 వరకు విక్రయిస్తున్నారు.

లారీ కిరాయి, హమాలీ, గోదాముల అద్దెలు ఇలా ప్రతి ఖర్చూ రైతుల నెత్తిన రుద్దు తూ అధికధర వసూలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కాంప్లెక్స్ ఎరువులు, పురుగుమందులు కొనేవారికి మాత్రమే యూరియా ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే స్టాక్ లేదని బుకాయించి వెనక్కి పంపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు

ఈ యాసంగిలో 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రసుత్తం 33 మండలాల్లోని పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. గోదాముల్లో మరో 15 వేల మెట్రిక్ టన్నులు ఉంది.

ఈ నెలాఖరు నాటికి 5 వేల మెట్రిక్ టన్నుల స్టాక్ రానుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియాను రైతులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 750పైగా గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి.

ఇందులో 300 దుకాణాల్లోనే యూరియా విక్రయాలు సాగుతున్నాయి. వీటికి సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల కేటాయింపులున్నాయి. బస్తాకు రూ.50 నుంచి 80 వరకు తీసుకున్నా ఈ లెక్కన దాదాపు రూ.40 కోట్ల నుంచి 60 కోట్ల వరకు వ్యాపారుల జేబులోకి వెళ్తున్నది.  

బ్లాక్ చేస్తుండటంతో కొరత..

కొందరు వ్యాపారులు యూరియాను బ్లాక్ చేసి కృతిమ కొరత సృష్టిస్తున్నారు. పీఏసీఎస్‌లలో సకాలంలో అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్లాక్ చేసిన వ్యాపారుల వద్దే ఫర్టిలైజర్ దుకాణాదారులు యూరియా కొంటుండటంతో రైతులు బస్తాకు అదనంగా రూ.50 నుంచి 80 వరకు చెల్లించాల్సి వస్తుంది. జిల్లాలో ప్రైవేట్ వ్యాపారుల వద్ద యూరియా దొరుకుతున్నా కొన్నిచోట్ల పీఏసీఎస్‌ల్లో కొరత ఉండటం వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణకు అద్దంపడుతోంది. 

వివరాల నమోదులో జాప్యం.. 

దుకాణాదారులు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయించగానే కొనుగోలు చేసిన రైతు ఆధార్ వివరాలు వెంటనే పీఓఎస్ (పాయింట్ ఆఫ్ స్కేల్)లో నమోదు చేయాలి. కానీ వ్యాపారులు ఇవేవీ పట్టించుకోకపోవడంతో స్టాక్ వివరాల్లో వ్యత్యాసం వస్తుంది. ఎంత విక్రయించారు? ఎవరికి ఇచ్చారు? అన్నది సక్రమంగా తెలియడం లేదు.

కొందరు పీఏసీఎస్ చైర్మన్లు సైతం వ్యాపారులతో కుమ్మకై ఇష్టానుసారంగా యూరియాను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విక్రయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఏఈవోలు, ఏవోలు కన్నెత్తి చూడకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. 

ఎమ్మార్పీకి అమ్మడం లేదు..

ఫర్టిలైజర్ దుకాణాదారులు యూ రియాని ఎమ్మా  అమ్మడం లేదు. బస్తాపై అదనంగా రూ.50 నుంచి 80 వరకు తీసుకుంటున్నారు. ఇదేంటని నిలదీస్తే రవాణా ఇతర ఖర్చులని చెబుతున్నారు. బస్తాకు రూ.10 అదనంగా తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పీఏసీఎస్‌ల్లో చాలాచోట్ల స్టాక్ ఉండటం లేదు.  

 జానపాటి భిక్షం, రైతు, 

చిల్లాపురం, మిర్యాలగూడ