calender_icon.png 24 December, 2024 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊర్ధాసనం

22-10-2024 12:00:00 AM

మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జీవన శైలిలో కొంత మార్పు చేసుకుంటే ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు. దాని కోసం యోగా ఆసనాలు ట్రై చేస్తే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కండరాల నొప్పులతో బాధపడేవారు ఊర్థ్య ఆసనం వేస్తే కండరాలు దృఢంగా మారడంతో పాటు.. ఎముక ఎదుగుదలకు తోడ్పడతాయి. 

ఎలా చేయాలి? 

నిటారుగా నిలబడి.. రెండు పాదాలను కాస్త దూరంగా ఉంచి.. రెండు చేతులను నెరుగా పైకిలేపి..  ఒక 15 సెకండ్లు ఉండాలి. తర్వాత నెమ్మదిగా చేతులను కిందకు తీసుకొని.. మామూలు స్థితిలోకి వస్తే సరిపోతుంది. 

ఉపయోగాలు

aఈ ఆసనం వల్ల భుజాల కండరాలు దృఢంగా తయారవుతాయి.  

aఎక్కువసేపు కూర్చొని ఉండేవారు ఈ ఆసనం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 

aఈ ఆసనం క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 

aపొత్తికడుపులో కొవ్వు కరిగించడంలో ఈ ఆసనం బాగా పని కొస్తుంది. 

 అనిత అత్యాల, అనిత యోగ అకాడమీ

6309800109