calender_icon.png 10 January, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ యాత్రలో అర్బన్ నక్సల్స్

21-12-2024 02:13:18 AM

మహా సీఎం ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో జరిగిన భారత్ జోడో యాత్రలో ‘అర్బన్ నక్సల్స్’ సంస్థలు పాల్గొన్నాయ ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. నవంబర్ 15న నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన రహస్య సమావేశంలో ఈవీఎంలను వ్యతిరేకించడంతో పాటు మహారాష్ట్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టడం లాంటి అంశాలపై వారితో చర్చించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అశాంతిని కలిగించేందుకు అనేక కుట్రలు చేశారని వాపోయారు. ఎన్నికల ఖర్చు కోసం టెర్రర్ ఫండ్స్‌ని వినియోగించారని..

ఈ విషయం యాంటీ టెర్రరిజం స్కాడ్ చేసిన విచారణలో స్పష్టమైనట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్లుగా కొనసాగుతున్న 40 సంస్థలు లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అలాగే 2014లో మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో లోక్‌సభ 72 ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల పేర్లను ప్రస్తావించిందని చెప్పారు. వాటిలో ఏడు సంస్థలు భారత్ జోడో యాత్రలో భాగమైనట్లు స్పష్టం చేశారు.